- కుడి చేతికి గాయం
శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. స్థానికంగా ఉన్న గురుద్వారా సమీపంలో ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో ఆయనపై దాడికి పాల్పడటంతో బాదల్ కుడి చేతికి గాయమైంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడి జరిగిన సమయంలో బాదల్ సతీమణి, అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ ఘటనలో బాదల్ భద్రతా సిబ్బందిలో కొందరికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. 2024 డిసెంబరులో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల కూడా బాదల్‌పై హత్యాయత్నం జరిగింది. ఓ వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపినా బుల్లెట్ గురితప్పడంతో ప్రాణాపాయం తప్పింది.
No comments:
Post a Comment