- పప్పు, నూనెగింజల ఉత్పత్తికి ప్రోత్సాహం: నిర్మలా సీతారామన్
రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయాన్ని మరింత స్థిరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ కనిష్ఠ మద్దతు ధర (ఎంఎస్‌పీ) విధానం కింద చెరకు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. రైతులు పంటల వైవిధ్యీకరణ వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా రైతులకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని పశుసంవర్ధక, మత్స్య రంగాలకు కూడా విస్తరించామని వెల్లడించారు.
No comments:
Post a Comment