Tuesday, 18 August 2026

యుద్ధ ప్రభావం.. కోల్గేట్‌ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం






న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ముడిసరుకుల వ్యయం పెరగడంతో కోల్గేట్‌-పామోలివ్‌ ఉత్పత్తుల ధరలు రానున్న త్రైమాసికాల్లో పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న వ్యయాలను తట్టుకుని లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు ధరల పెంపు అవసరమని కంపెనీ సీఈవో, ఎండీ ప్రభా నరసింహన్‌ తెలిపారు. యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిసరుకుల సరఫరాపై ప్రభావం పడుతోందని, ధరలు పెంచకపోతే భవిష్యత్తులో ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. మరోవైపు ప్రీమియం టూత్‌పేస్ట్‌, టూత్‌బ్రష్‌ ఉత్పత్తులపై కంపెనీ దృష్టి సారిస్తోంది. పామోలివ్‌ మార్కెట్‌ను బలోపేతం చేసేందుకు బాంబే షేవింగ్‌ కంపెనీతో భాగస్వామ్యం చేసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

No comments:

Post a Comment

Featured post

మీ ధైర్యం ఎన్నో ప్రాణాలను కాపాడింది

ఫ్లై దుబాయ్‌ కెప్టెన్‌తో మోడీ వీడియో కాల్‌ న్యూఢిల్లీ: ఫ్లై దుబాయ్‌ విమాన కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌తో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాల్‌లో మా...