Saturday, 15 August 2026

పేదలకు 500 షరతులు.. పెద్దల చేతుల్లో లక్షల కోట్ల అవినీతి

 


  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌: పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5-6 లక్షల సాయం కోరితే 500 రకాల షరతులు విధిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మరోవైపు రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని ఇతర కీలక నేతలు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని ఢిల్లీలో కూర్చున్న రాహుల్‌ గాంధీ, ఏఐసీసీకి ఏటీఎంగా మార్చేశారని కేటీఆర్‌ విమర్శించారు. స్వయంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో బహిరంగంగా మాట్లాడుతున్నారని, రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలను గమనిస్తున్నారనే ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యటనల్లో రాష్ట్రం ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ తరచూ చెబుతుంటారని కేటీఆర్‌ గుర్తుచేశారు. అయితే ఈ ఆరోపణలపై కేంద్రం నుంచి ఎలాంటి కఠిన చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని ఓ మంత్రిపై ఈడీ దాడులు జరిగినప్పటికీ ఆ తర్వాత దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆయన ఆరోపించారు.

No comments:

Post a Comment

Featured post

వందేమాతరం వివాదంపై కాంగ్రెస్‌ వివరణ

ఖర్గేకు కుర్చీ కోసమే సోనియా ఆదేశాలు: తారిఖ్‌ అన్వర్‌ న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం ఆలాపనపై ఎలాంటి వివాదం జరగలేదని కాంగ...