Thursday, 13 August 2026

హఫీజ్‌ సయీద్‌కు నేను దాసుడిని

 


  •  పాక్‌ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌లో రాజకీయ నేతలకు, ఉగ్రవాద సంస్థలకు మధ్య సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది. లష్కరే తయ్యిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు తాను దాసుడినంటూ పాక్‌ మాజీ మంత్రి షేక్‌ రషీద్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ బహిరంగ వేదికపై మాట్లాడుతూ.. తన ఫోన్‌లో హఫీజ్‌ సయీద్‌ నంబర్‌ ఉన్న కారణంగానే అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యానని రషీద్‌ పేర్కొన్నారు. హఫీజ్‌ సయీద్‌కు తన మద్దతును కూడా ప్రకటించారు. 2020 నుంచి 2022 వరకు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంలో రషీద్‌ పాక్‌ హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఐక్యరాజ్యసమితి ఇప్పటికే హఫీజ్‌ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది.


No comments:

Post a Comment

Featured post

ఆసియా క్రీడలు 2026: మహిళల 4x400 మీటర్ల రిలేలో భారత్‌కు స్వర్ణం

నాగోయా: జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్‌ ఈరోజు మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. భారత జట్టు 3 నిమిషాల 29.69 స...