- ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
హార్ముజ్ జలసంధి తమ నియంత్రణ, నిర్వహణలోనే ఉందని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ బసీజ్ పారామిలిటరీ దళాల అధిపతి హొస్సేన్ తాయెబ్ గురువారం ఈ వ్యాఖ్యలు చేసినట్లు సెమీ-అధికారిక ఫార్స్ వార్తా సంస్థ వెల్లడించింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ జలమార్గంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. హార్ముజ్ జలసంధిపై అమెరికా ‘‘పూర్తి నియంత్రణ’’ సాధించిందంటూ ట్రంప్ ఒక రోజు ముందు తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. అయితే, ఈ వాదనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా మరోసారి యుద్ధానికి దిగడం ద్వారా ఈ ప్రాంతంలో ఇస్లామిక్ రిపబ్లిక్ పట్ల ఉన్న ప్రజాదరణను దెబ్బతీయాలని ప్రయత్నించిందని తాయెబ్ ఆరోపించారు.
ఇరాన్‌కు వైమానిక దళం, నౌకాదళం లేవంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలు ఉన్నప్పటికీ.. తమ దేశం అమెరికాను మరోసారి ఓడించిందని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం హార్ముజ్ జలసంధి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆధీనంలో, దాని నిర్వహణలో ఉంది. ఇరాన్ పూర్తి భద్రతతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది’’ అని తాయెబ్ వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరు దేశాల పరస్పర విరుద్ధ ప్రకటనలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
No comments:
Post a Comment