Thursday, 13 August 2026

2047 నాటికి గౌరవనీయ దేశంగా భారత్‌


  • శాంతియుత విప్లవానికి సోనం వాంగ్‌చుక్‌ పిలుపు



స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ దేశ రాజకీయ నాయకత్వాన్ని ఎన్నుకునే విధానంలో ‘‘శాంతియుత విప్లవం’’ రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్‌ గౌరవనీయమైన దేశంగా కొనసాగాలంటే రాజకీయ వ్యవస్థలో గణనీయమైన మార్పు అవసరమని ఆయన అన్నారు.స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు విడుదల చేసిన వీడియో సందేశంలో వాంగ్‌చుక్‌ ‘‘భారత్‌ రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ చేపట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు స్వార్థరహితంగా, నిర్భయంగా పనిచేసే, నైతిక విలువలు, సామర్థ్యం కలిగిన నాయకులను ప్రజలు సూచించాలని ఆయన కోరారు. దేశానికి అవసరమైన మార్పు శాంతియుత మార్గంలోనే సాధించాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Featured post

వందేమాతరం వివాదంపై కాంగ్రెస్‌ వివరణ

ఖర్గేకు కుర్చీ కోసమే సోనియా ఆదేశాలు: తారిఖ్‌ అన్వర్‌ న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం ఆలాపనపై ఎలాంటి వివాదం జరగలేదని కాంగ...