Tuesday, 25 August 2026

రేవంత్‌ రెడ్డి పై బీజేపీ విమర్శలు

 



హైదరాబాద్‌: అమెరికా పర్యటనకు వీసా నిరాకరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత బండారు విజయలక్ష్మి స్పందించారు. రేవంత్‌ రెడ్డి ఆరోపణలు కేవలం ఎంవోయూలు, ఒప్పందాలు, ప్రెస్‌మీట్లకే పరిమితమయ్యాయని విమర్శించారు.

గుజరాత్‌ వంటి ఇతర రాష్ట్రాల అభివృద్ధి నమూనాలను పరిశీలిస్తే మౌలిక వసతుల రంగంలో మరింత పురోగతి కనిపిస్తోందని ఆమె అన్నారు. ముందుగా తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధిపై రేవంత్‌ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

దావోస్‌ పర్యటన ద్వారా రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని ప్రశ్నించిన విజయలక్ష్మి.. ఇప్పుడు అమెరికా పర్యటనల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశ వ్యతిరేకులుగా భావిస్తున్న వ్యక్తులను ఎందుకు కలిశారని ప్రశ్నించారు. అమెరికా పర్యటన రద్దుకు నిర్దిష్ట కారణం తమకు తెలియదని విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పిందని పేర్కొంటూ.. ఆ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని, దాని సమగ్రతను అభినందించాల్సిందేనని అన్నారు.

No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...