ఆగస్టు 2న ఫ్రెండ్ షిప్ డే అని చాలామంది మిత్రులు విషెస్ పెట్టారు. సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి రోజులన్నీ ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, వాట్సాప్ స్టేటస్ లలో కనిపిస్తున్నాయి. నిజానికి నా దృష్టిలో దోస్త్ అంటే మరో మనిషి మనలా ఆలోచించడం. ఏమీ ఆశించకుండా సహాయం చేయడం. మనకు కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడటం.. ఇవన్నీ సినిమాల్లోనే కాదు ప్రతీ వ్యక్తి జీవితంలో జరుగుతుంటాయి. నా విషయానికి వస్తే మిత్రుడు మోహన్ లేని లోటు నన్ను నిత్యం కలిచివేస్తుంది. పదో తరగతి ట్యూషన్ లో అనుకోకుండా పరిచయమైన మా స్నేహం రెండు దశాబ్దాలకు పైగా అప్రతిహతంగా సాగింది. నేను జర్నలిజంలో చేరాక ఏడాదికి రెండుమూడు సార్లు గోదావరిఖనికి వెళ్తే కొన్ని జ్ఞాపకాలను మోసుకొచ్చేది మిత్రుడితో గడిపిన క్షణాలే. గంటల తరబడి అనేక విషయాలపై మాట్లాడుకునేవాళ్లం. పోషమ్మ గుడి దగ్గరే మా వినోదాలు, వలపోతలు, విజయగాథలు అన్నీ అక్కడే చర్చించుకునేవాళ్లం. కొవిడ్ డెల్టా వైరస్ మిత్రుడిని కబళించిన తర్వాత ఫ్రెండ్ షిప్ అనే పదం గోడపై వేలాడ దీసిన మోహన్ ఫొటో అయిపోయింది. జనవరి 1న నాయిన మైన్ లో సిక్ అయితే ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఆపరేషన్ తర్వాత ఆయన భౌతికకాయాన్ని అవ్వ, మేనమామ ఇద్దరే సొంతూరు చల్లూరుకు తీసుకొచ్చినప్పుడు పెద్దగా లోకజ్ఞానం లేదు. కానీ అప్పటి నుంచి కొత్త సంవత్సరం అంటే అనారోగ్యానికి గుర్తుగా మారిపోయింది. అందుకే జనవరి 1 అయినా ఆగస్టు 2 అయినా ఈ రెండు రోజులు కళ్లు కన్నీళ్లతో కలవరిస్తాయి. వాళ్లిద్దరూ ఒకసారి తిరిగి వస్తే బాగుండు అని. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం ఎక్కువగా ఎవరిని ఇష్టపడితే వారు మనకు దూరం అవుతారని. కానీ ఒకరిద్దరు మానవత్వం ఉన్నవాళ్లు ప్రతి మనిషి జీవితంలో తారసపడుతుంటారు. నువ్వు అంటే నేను అని చెబుతుంటారు. అది అర్థం అయ్యేసరికి చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంటారు. మిస్ యూ మిత్రమా మోహన్. యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్, ఎవర్, అండ్ ఎవర్.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
బీజేపీ క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేస్తున్న పార్టీ: సాయోని ఘోష్
విపక్షాల్లో తీవ్ర గందరగోళం.. ప్రజలకు ప్రస్తుతం నమ్మదగిన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు అధికార పార్టీ వైపు ఉప ఎన్నికల్లో మొగ్గు సాధారణమే.. ప్రజ...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
అలీ ఖమేనీ మృతితో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్‌కు లరిజానీ భయంకర హెచ్చరిక! టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమ...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...
No comments:
Post a Comment