Tuesday, 18 August 2026

భారత్‌ ఎన్నికల విధానమే ఆదర్శం: ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు



వాషింగ్టన్‌: అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు, పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేయాలని పట్టుబడుతున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ‘సేవ్‌ అమెరికా యాక్ట్‌’ను తక్షణమే ఆమోదించాలని మరోసారి కోరారు. ఈ సందర్భంగా భారత్‌ ఎన్నికల విధానాన్ని ప్రశంసిస్తూ, అమెరికా దానిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భారత్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని, ఒక శాతం కంటే తక్కువ మంది మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారని ట్రంప్‌ తెలిపారు. భారత్‌లో ప్రతి ఓటరుకూ చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు కార్డు ఉంటుందని పేర్కొంటూ, అమెరికాలోనూ ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేయాలని తన ‘ట్రూత్‌ సోషల్‌’ పోస్టులో పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Featured post

మీ ధైర్యం ఎన్నో ప్రాణాలను కాపాడింది

ఫ్లై దుబాయ్‌ కెప్టెన్‌తో మోడీ వీడియో కాల్‌ న్యూఢిల్లీ: ఫ్లై దుబాయ్‌ విమాన కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌తో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాల్‌లో మా...