రాష్ట్ర సాధనలో రాజీనామాలే కీలక ఆయుధం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్) పుట్టుకే పదవి త్యాగంతో ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం కేవలం నినాదాలతో కాదు, త్యాగాలు, రాజీనామాలు, రాజకీయ పోరాటంతో విజయాన్ని సాధించిందని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ 2006లో తన పదవికి రాజీనామా చేసి, అనంతరం 2008లో మరోసారి రాజీనామా చేసిన సమయంలో తాను తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌తో చర్చించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా జయశంకర్ సార్ ఉద్యమానికి మూడు కీలక పార్శ్వాలు ఉంటాయని వివరించారని తెలిపారు.
మొదటి దశలో ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తి చేయడం, రెండో దశలో ప్రజా ఆందోళనలను నిర్మించడం జరుగుతుందని, ఈ రెండు దశలు కలిసినప్పుడే ఉద్యమం రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతుందని జయశంకర్ చెప్పినట్లు కేటీఆర్ వెల్లడించారు.
అప్పటి వరకు కేంద్రాన్ని యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి ఎదిగి, ఢిల్లీ మెడలు వంచించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్నదే ఉద్యమ లక్ష్యమని జయశంకర్ స్పష్టం చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక ఉన్న రాజకీయ త్యాగాలు, ఉద్యమ వ్యూహాలను ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
No comments:
Post a Comment