పలు రాష్ట్రాల్లో అతి భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల విస్తరణ అత్యంత వేగంగా సాగుతోంది. రుతుపవనాలు దిల్లీ, గుజరాత్‌లోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తర ప్రదేశ్‌లోని మిగిలిన భాగాలు, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లలోని మెజారిటీ ప్రాంతాలతో పాటు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో అక్కడక్కడ అత్యంత భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల తీవ్రత దృష్ట్యా స్థానిక యంత్రాంగాలు ముందస్తు చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.
No comments:
Post a Comment