- ఓవరాల్ ఛాంపియన్లుగా సబ్ జూనియర్ బాలికలు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగిన అస్మిత సౌత్ జోన్ కానోయీ స్ప్రింట్ ఛాంపియన్‌షిప్ (Canoeing Sprint Championship) లో తెలంగాణ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచింది. సబ్ జూనియర్ బాలికల విభాగంలో తెలంగాణ అమ్మాయిలు సంచలన ప్రదర్శనతో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో తెలంగాణ జట్టు మొత్తం 3 బంగారు, 3 వెండి, 7 కాంస్య పతకాలతో కలిపి 13 పతకాలు సాధించింది. అద్భుత విజయం సాధించిన క్రీడాకారిణులను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి ప్రత్యేకంగా అభినందించారు.

No comments:
Post a Comment