Wednesday, 22 July 2026

టెహ్రాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తాం



 ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక!

వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఇరాన్ గనుక దాడులు కొనసాగిస్తే, ఆ దేశ రాజధాని టెహ్రాన్‌లోని కీలక వంతెనలు, విద్యుత్ కేంద్రాలను బాంబులతో పేల్చివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యూహాత్మక జలసంధి ద్వారా నౌకాయానం పునరుద్ధరించాలని, దాడులు పూర్తిగా ఆపాలని సీజ్‌ఫైర్ చర్చల్లో అమెరికా ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. గత మూడు నెలల్లో ఇరాన్ 30కి పైగా వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడిందని నౌకాదళం తెలిపింది.  ట్రంప్ తన ట్రూత్ సోషల్ (Truth Social) ఖాతాలో స్పందిస్తూ.. ఇరాన్ మిస్సైళ్లు, రాకెట్లు, డ్రోన్లు లేదా ఇతర ఆయుధాలతో జలసంధిలో ఏ నౌకపై దాడి చేసినా, దానికి ప్రతీకారంగా రాజధాని టెహ్రాన్‌లో ఉన్న ఒక వంతెనను లేదా విద్యుత్ రంగానికి చెందిన మౌలిక సదుపాయాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని వెల్లడించారు. అమెరికా దళాలు ఇప్పటికే వరుసగా 11 రాత్రులు దక్షిణ ఇరాన్‌లోని సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించగా, నేరుగా టెహ్రాన్ నగరంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై దాడులు జరిపితే యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి

No comments:

Post a Comment

Featured post

చర్చలకు మేము సిద్ధం

జంతర్ మంతర్ లేదా తటస్థ వేదిక వద్దే కలవాలని ప్రభుత్వానికి సీజేపీ స్పష్టీకరణ న్యూఢిల్లీ:పోటీ పరీక్షల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అక్రమాలపై కొ...