Thursday, 9 July 2026

ఇథనాల్ మిశ్రమంపై కేంద్రానిది మొండివైఖరి




  • ప్రజలకు ఆప్షన్ ఇవ్వకపోవడం ముమ్మాటికీ నియంతృత్వమే
  •  హర్దీప్ పూరి ఇంటర్వ్యూపై ఆప్ జాతీయ కన్వీనర్  కేజ్రీవాల్ ఆగ్రహం
  • కోట్ల మంది గొంతుకను వినాల్సిందిగా ప్రధాని మోడీకి హితవు

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ-20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) పెట్రోల్ విధానంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి 2, 3 టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలను తాను చూశానని, ఇథనాల్ అంశంపై ఆయన ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవని కేజ్రీవాల్ విమర్శించారు. ఇంధనం ఎంచుకునే విషయంలో ప్రజలకు ఎలాంటి ప్రత్యామ్నాయం (ఆప్షన్) ఇచ్చే ప్రసక్తే లేదని హర్దీప్ పూరి ఆ ఇంటర్వ్యూలలో స్పష్టంగా చెప్పడాన్ని కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "ప్రభుత్వానికి ఇంతటి అహంకారం మంచిది కాదు. ప్రజలపై బలవంతంగా ఇంధనాన్ని రుద్దడం ముమ్మాటికీ నియంతృత్వమే అవుతుంది. ఈ విధానం వల్ల మైలేజీ తగ్గిపోతోందని, పాత వాహనాల ఇంజన్ భాగాలు దెబ్బతింటున్నాయని దేశంలోని కోట్ల మంది ప్రజలు తమ గొంతుకను వినిపిస్తున్నప్పుడు.. వారి సమస్యలను ఆలకించడం ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ కనీస ధర్మం. ఇప్పటికైనా ప్రజల మాట వినండి, ఇలాంటి మొండి వైఖరి దేశానికి అస్సలు మంచిది కాదు" అని హితవు పలికారు. ఇథనాల్ బ్లెండింగ్ విధానంపై ప్రజల్లో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించకుండా కేంద్రం మొండిగా ముందుకు వెళ్లడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

ఇథనాల్ మిశ్రమంపై కేంద్రానిది మొండివైఖరి

ప్రజలకు ఆప్షన్ ఇవ్వకపోవడం ముమ్మాటికీ నియంతృత్వమే  హర్దీప్ పూరి ఇంటర్వ్యూపై ఆప్ జాతీయ కన్వీనర్  కేజ్రీవాల్ ఆగ్రహం కోట్ల మంది గొంతుకను వినాల్స...