Thursday, 2 July 2026

హైదరాబాద్‌లో ఓటర్ల సహాయార్థం 16 ప్రత్యేక హెల్ప్ డెస్కుల ఏర్పాటు

 



హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఓటర్లకు మరింత సమాచారం, సహాయం అందించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సాగుతున్న ఓటర్ల ప్రత్యేక ముసాయిదా సవరణ ప్రక్రియ (SIR) పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు అధికారులు నడుం బిగించారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా గల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) కార్యాలయాల్లో 16 ప్రత్యేక హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పుల సవరణ, చిరునామా మార్పులు వంటి సేవలను పౌరులు సులభంగా పొందేందుకు ఈ హెల్ప్ డెస్కులు ఎంతగానో దోహదపడతాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

No comments:

Post a Comment

Featured post

మీ ధైర్యం ఎన్నో ప్రాణాలను కాపాడింది

ఫ్లై దుబాయ్‌ కెప్టెన్‌తో మోడీ వీడియో కాల్‌ న్యూఢిల్లీ: ఫ్లై దుబాయ్‌ విమాన కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌తో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాల్‌లో మా...