హైదరాబాద్, అక్టోబర్ 2:రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు బారిన పడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోరేందుకు ప్రత్యేక మంత్రుల బృందాన్ని దిల్లీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సచివతలంలో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇది విపత్తు వంటి పరిస్థితి అని, దీనికి కేంద్రం నుంచి తగిన మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారు.
అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాటకు కట్టుబడి దసరా కానుకగా రెండు కరవు భత్యాలను (DA) విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై కొంత భారం పడినప్పటికీ, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో వ్యవసాయం, సాగునీరు తదితర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించామని, భవిష్యత్తులోనూ సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో ప్రభుత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment