- క్రమంగా ప్రేమ, ఆత్మీయతతో ఈ నేలలో భాగమయ్యా
నేను తొలిసారిగా భారత్‌కు వచ్చినప్పుడు, ఈ దేశంలో నా స్థానం ఏమిటి? నేను ఎక్కడికి చెందినదాన్ని? అనే ప్రశ్నలు తరచూ నా మనసులో మెదిలేవి. ఒక కొత్త కుటుంబంలోకి, కొత్త సంస్కృతిలోకి, పూర్తిగా పరిచయం లేని ప్రపంచంలోకి అడుగుపెడుతున్న అనుభూతి కలిగేది. ఇక్కడ నా స్థానాన్ని, నా ఉనికిని గుర్తించుకోవడానికి కొంత సమయం పట్టింది. పెళ్లి తర్వాత కొత్త కుటుంబంలోకి అడుగుపెట్టే భారతీయ యువతుల్లో చాలామంది కూడా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొంటారని భావిస్తున్నాను. ప్రారంభంలో అనిశ్చితితో మొదలైన నా ప్రయాణం క్రమంగా ప్రేమగా, ఆదరణగా మారింది. ఆ తర్వాత ఈ దేశం, ఈ కుటుంబం నాదనే గాఢమైన అనుబంధ భావన నాలో ఏర్పడింది. చివరకు భారత్‌లో నాకు ఒక ప్రత్యేకమైన ఆత్మీయ స్థానం లభించిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తన తాజా పోస్టులో పేర్కొన్నారు.
