- ప్రధాని మోదీ వ్యాఖ్యలపై టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్
1933 నాటి నాజీ జర్మనీ, 1975లో భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ పరిస్థితుల మధ్య పోలికలపై ప్రధాని నరేంద్ర మోదీ రాసిన వ్యాసం రాజకీయంగా చర్చకు దారితీసింది. బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ రచించిన ‘ఎ ప్రిజనర్స్ స్క్రాప్‌బుక్’ పుస్తకంలో ఈ రెండు కాలాల మధ్య ఉన్న సారూప్యతలను వివరించారని మోదీ తన వ్యాసంలో ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ స్పందించారు.
ఈ సందర్భంగా కీర్తి ఆజాద్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పనితీరును కూడా పోల్చి చూడాలని సూచించారు. ప్రభుత్వాన్ని, అధికార పక్షాన్ని వ్యతిరేకించే వారిని ‘మేధో నక్సలైట్లు’గా ముద్ర వేస్తున్నారని, అలాంటి వారిని హత్య చేయడం, జైలులో పెట్టడం లేదా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసుల్లో ఇరికించడం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
1933 నాటి నాజీ జర్మనీ, 1975 నాటి భారత ఎమర్జెన్సీ పరిస్థితులతో పాటు 2014 నుంచి 2026 వరకు దేశంలో నెలకొన్న పరిస్థితులను కూడా సమగ్రంగా పోల్చి చూడాలని కీర్తి ఆజాద్ పేర్కొన్నారు. అప్పుడే వాస్తవ పరిస్థితులపై స్పష్టమైన చిత్రం బయటపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

No comments:
Post a Comment