Tuesday, 10 November 2026

"యుద్ధం మొదలుపెడదామా..?"



  • ట్రంప్‌నకు రోజూ నెతన్యాహు ఫోన్‌కాల్స్

ఇరాన్‌పై దాడులు పునఃప్రారంభించకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిరోజూ ట్రంప్‌నకు ఫోన్‌ చేసి.. టెహ్రాన్‌పై మళ్లీ దాడులు చేద్దామా అని అడిగేవారని అమెరికా మీడియా ఓ కథనంలో వెల్లడించింది. రాజకీయ లబ్ధి కోసం నెతన్యాహు ఈ యత్నాలు చేసినట్లు తెలిపింది. అమెరికా అధ్యక్షుడికి ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవాలనే ఆసక్తి ఉండడంతో ఆయన అందుకు నిరాకరించినట్లు పేర్కొంది. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితం వెలువడిన వెంటనే ఇరాన్‌పై దాడి చేయాలని నెతన్యాహు ట్రంప్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే యుద్ధానికి బదులుగా చర్చలతోనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారని వైట్‌హౌస్ అధికారులు వెల్లడించారు.



No comments:

Post a Comment

Featured post

“నాన్న చనిపోయారు”

రాజీవ్ గాంధీ హత్య వార్తను సోనియాకు చెప్పిన ప్రియాంక ఆ విషాద క్షణాలను గుర్తుచేసుకున్న సోనియా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య తన జీవితంలో ...