Sunday, 8 November 2026

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ మిషన్‌ ఇంకా పూర్తికాలేదు



  • అణ్వాయుధాల అభివృద్ధిపై ఇజ్రాయెల్‌ ఆందోళన

ఇరాన్‌పై తాము చేపట్టిన సైనిక మిషన్‌ ఇంకా పూర్తికాలేదని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించేలా ఇరాన్‌ అణ్వాయుధాల అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించడంతోపాటు ఇతర ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టబోయే సైనిక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కట్జ్‌ దేశ సైన్యానికి పిలుపునిచ్చారు.


అమర సైనికుల స్మారక కార్యక్రమంలో పాల్గొన్న కట్జ్‌ మాట్లాడుతూ.. దేశ భద్రతకు సంబంధించిన లక్ష్యాలను సాధించాలంటే ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌) తమ పూర్తి సామర్థ్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇరాన్‌ అణ్వాయుధ కార్యక్రమాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోందని, ఇజ్రాయెల్‌ భద్రతకు ప్రమాదం కలిగించే చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే భారీ సైనిక కార్యకలాపాల కోసం దేశ ప్రజలు, సైనికులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.


ఇదే సమయంలో ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తున్న లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా సంస్థను కూడా ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్‌పై యుద్ధంలో ఇరాన్‌తో కలిసి దాడులకు దిగాలని హెజ్‌బొల్లా నిర్ణయించుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. గాజా, లెబనాన్‌, సిరియా ప్రాంతాల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కట్జ్‌ పేర్కొన్నారు. దీంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.



No comments:

Post a Comment

Featured post

“నాన్న చనిపోయారు”

రాజీవ్ గాంధీ హత్య వార్తను సోనియాకు చెప్పిన ప్రియాంక ఆ విషాద క్షణాలను గుర్తుచేసుకున్న సోనియా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య తన జీవితంలో ...