Tuesday, 10 November 2026

ట్రంప్‌ ప్రకటనతో కుప్పకూలిన చమురు ధరలు.. మూడు నెలల కనిష్ఠానికి బ్రెంట్‌ క్రూడ్‌



అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు జరిగే అవకాశం లేదంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో చమురు మార్కెట్లో ట్రేడర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. బ్రెంట్‌ క్రూడ్‌ ధర మూడు నెలల కనిష్ఠానికి పడిపోయి బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు చేరింది. మంగళవారం ట్రేడింగ్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 3.3 శాతం తగ్గగా, అమెరికా వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ (WTI) క్రూడ్‌ ధర 2.6 శాతం పతనమై 84.1 డాలర్ల వద్ద ట్రేడైంది.


వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ ఇరాన్‌ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశంపై మరిన్ని దాడులు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. అయితే ఇరాన్‌ అణు కార్యకలాపాలకు దూరంగా ఉండేలా దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా భావిస్తోందని తెలిపారు. పరిస్థితులు మారితే ఎదుర్కొనేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇరాన్‌ అణు కార్యక్రమంపై ఒప్పందం కుదిరి, హర్మూజ్‌ జలసంధి తిరిగి తెరుచుకుంటే దాడుల అవకాశాలు మరింత తగ్గుతాయని ట్రంప్‌ గతంలోనూ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.



No comments:

Post a Comment

Featured post

“నాన్న చనిపోయారు”

రాజీవ్ గాంధీ హత్య వార్తను సోనియాకు చెప్పిన ప్రియాంక ఆ విషాద క్షణాలను గుర్తుచేసుకున్న సోనియా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య తన జీవితంలో ...