Tuesday, 10 November 2026

సెమీస్‌కు దూసుకెళ్లిన యువ భారత్‌.. యూఏఈపై 70 పరుగుల ఘన విజయం



అల్‌ అమెరత్‌ (ఒమన్‌): అండర్‌-19 ఆసియా వన్డే కప్‌లో భారత యువ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూఏఈపై 70 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 309 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ 50 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది.


భారత ఇన్నింగ్స్‌లో మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కుమారుడు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ అద్భుతంగా ఆడాడు. 168 బంతుల్లో 17 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 160 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. వీకే వినీత్‌ 67 పరుగులతో అర్ధశతకం నమోదు చేశాడు. లక్ష్య రాజేశ్‌ రాయ్‌చందాని, యశ్‌బర్దాన్‌ చౌహాన్‌ చెరో 17 పరుగులు చేయగా, అన్వయ్‌ ద్రవిడ్‌ 12 పరుగులు సాధించాడు.


యూఏఈ బ్యాటర్లలో అహ్మద్‌ ఖుదాదాద్‌ 74 పరుగులతో పోరాడగా, నూరుల్లా అయోబీ 39 పరుగులు చేశాడు. ఏడో వికెట్‌కు వీరిద్దరూ 52 బంతుల్లోనే 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. భారత బౌలర్‌ ఇషాన్‌ సోద్‌ 37 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఈ విజయంతో సెమీఫైనల్‌కు చేరిన భారత్‌ గురువారం జరిగే రెండో సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది.



No comments:

Post a Comment

Featured post

“నాన్న చనిపోయారు”

రాజీవ్ గాంధీ హత్య వార్తను సోనియాకు చెప్పిన ప్రియాంక ఆ విషాద క్షణాలను గుర్తుచేసుకున్న సోనియా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య తన జీవితంలో ...