Sunday, 8 November 2026

406 జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ విజయం



  • జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలు విడుదల


ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ 406 స్థానాల్లో విజయం సాధించగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 76, జనసేన 73, భారతీయ జనతా పార్టీ 20 స్థానాల్లో గెలుపొందాయి. స్వతంత్ర అభ్యర్థులు ఆరు స్థానాల్లో విజయం సాధించగా, సీపీఐ(ఎం) ఒక స్థానాన్ని దక్కించుకుంది.


మరోవైపు మొత్తం 7,768 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లోనూ తెదేపా ఆధిక్యం ప్రదర్శించింది. తెలుగుదేశం పార్టీ 4,806 స్థానాలను గెలుచుకోగా, వైసీపీ 1,711, జనసేన 938, బీజేపీ 117 స్థానాల్లో విజయం సాధించాయి. స్వతంత్ర అభ్యర్థులు 169 స్థానాలను కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిది, సీపీఐ(ఎం) 15, బహుజన్‌ సమాజ్‌ పార్టీ మూడు స్థానాల్లో గెలుపొందాయి.


రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అత్యధిక స్థానాలను సాధించగా, వైసీపీ రెండో స్థానంలో నిలిచింది. జనసేన, బీజేపీ కూడా పలు స్థానాల్లో విజయం సాధించాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది గణాంకాలతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చింది.



No comments:

Post a Comment

Featured post

“నాన్న చనిపోయారు”

రాజీవ్ గాంధీ హత్య వార్తను సోనియాకు చెప్పిన ప్రియాంక ఆ విషాద క్షణాలను గుర్తుచేసుకున్న సోనియా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య తన జీవితంలో ...