Friday, 6 November 2026

వైద్యుడిపై దాడి కేసులో ట్విస్ట్‌.. నటిపై బంధువు అత్యాచార ఆరోపణలు!

 



కొచ్చి: వైద్యం పేరుతో ఓ వైద్యుడిని ఫ్లాట్‌కు పిలిపించి దాడి చేసి, ఆయన వద్ద నుంచి రూ.3.5 లక్షల విలువైన వస్తువులు దోచుకున్నారనే ఆరోపణలతో నమోదైన కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో సదరు వైద్యుడిపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. తనకు మత్తుమందు ఇచ్చి వైద్యుడు లైంగికంగా వేధించాడంటూ నటి అతుల్య చంద్ర బంధువు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.


బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇంటి వద్దే వైద్యం అందించేందుకు నటి అతుల్య చంద్ర ఏర్పాట్లు చేశారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు తరచూ ఫ్లాట్‌కు వచ్చి చికిత్స అందించేవారు. అయితే ఈ క్రమంలో ఓసారి వైద్యుడు తనకు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించాడని బాధితురాలు ఇటీవల నటికి తెలిపింది.


దీంతో ఆగ్రహానికి గురైన అతుల్య చంద్ర తన స్నేహితులు, నటుడు-నిర్మాత బిబిన్‌ పెరుంబిల్లితో కలిసి వైద్యుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పథకం ప్రకారం అత్యవసరంగా చికిత్స అందించాలంటూ ఫోన్‌ చేసి వైద్యుడిని ఫ్లాట్‌కు రప్పించారు. ఆయన అక్కడికి చేరుకోగానే అందరూ కలిసి చుట్టుముట్టి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.


ఈ సందర్భంగా బాధితురాలికి రూ.25 లక్షలు చెల్లించేలా వైద్యుడితో ఒప్పందం కుదుర్చుకుని అనంతరం వదిలిపెట్టినట్లు కథనం. ఈ ఘటన తర్వాత పోలీసులను ఆశ్రయించిన వైద్యుడు.. తనను ఫ్లాట్‌లో నిర్బంధించి దాడి చేశారని, రూ.3.5 లక్షల విలువైన వస్తువులను బలవంతంగా తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే అత్యాచారం కేసు పెడతామని బెదిరించారని కూడా ఆరోపించారు.


అయితే తాజాగా నటి బంధువు చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో వైద్యుడిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఇరువర్గాల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వైద్యుడిపై వచ్చిన అత్యాచార ఆరోపణలు, వైద్యుడి ఫిర్యాదులో పేర్కొన్న దాడి, దోపిడీ ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.

No comments:

Post a Comment

Featured post

వైద్యుడిపై దాడి కేసులో ట్విస్ట్‌.. నటిపై బంధువు అత్యాచార ఆరోపణలు!

  కొచ్చి: వైద్యం పేరుతో ఓ వైద్యుడిని ఫ్లాట్‌కు పిలిపించి దాడి చేసి, ఆయన వద్ద నుంచి రూ.3.5 లక్షల విలువైన వస్తువులు దోచుకున్నారనే ఆరోపణలతో నమో...