- ఇండియన్ ఐడల్ నుంచి బిగ్‌బాస్ వరకు
2004-05లో ప్రసారమైన తొలి సీజన్ ‘ఇండియన్ ఐడల్’ వేదికపై తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జబల్‌పూర్‌కు చెందిన ప్రజక్తా శుక్రే, తన సంగీత ప్రయాణంలో ఎన్నో మలుపులు దాటారు. అప్పట్లో 12వ తరగతి చదువుతున్న ఆమె, చదువుతో పాటు గానంపై ఆసక్తిని కొనసాగిస్తూ పోటీలో నాలుగో స్థానాన్ని సాధించారు. ఆ సీజన్‌లో టాప్-5లోకి చేరిన ఏకైక మహిళా కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందారు. ఇండియన్ ఐడల్ తర్వాత ప్రజక్తాకు సినీ నేపథ్య గాయనిగా అవకాశాలు వచ్చాయి. ‘షాదీ నంబర్ 1’, ‘జాన్-ఎ-మన్’, ‘తీస్ మార్ ఖాన్’, ‘మణికర్ణిక’ వంటి చిత్రాల్లో పాటలు పాడారు. స్వతంత్ర సంగీతం, భక్తి గీతాలు, మరాఠీ సంగీత ప్రాజెక్టుల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. విభిన్న సంగీత ప్రక్రియల్లో తన గాత్రంతో ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత ‘బిగ్‌బాస్ మరాఠీ-6’లో పాల్గొని మరో రియాలిటీ షో ప్రయాణాన్ని కొనసాగించారు. తాజాగా 2026లో ‘ఇండియన్ ఐడల్’ వేదికపై ‘లెజెండ్స్ రిటర్న్’ కార్యక్రమంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అభిజీత్ సావంత్, అమిత్ సనా వంటి గత సీజన్ పరిచయమైన గాయకులతో మరోసారి వేదికను పంచుకున్నారు. టీనేజ్‌లో గాయనిగా గుర్తింపు కోసం అడుగుపెట్టిన ప్రజక్తా, తనను పరిచయం చేసిన వేదికపైనే తిరిగి కనిపించడం విశేషం.

No comments:
Post a Comment