Sunday, 4 January 2026

కాంగ్రెస్ డీఎన్ఏలోనే అవినీతి ఉంది

 




 'మహాత్మా గాంధీ ఉపాధి హామీ బచావో' ఉద్యమంపై శివరాజ్ సింగ్ చౌహాన్ ఘాటు విమర్శలు


కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడతామంటూ కాంగ్రెస్ ప్రకటించిన 'MGNREGA బచావో సంగ్రామ్' కేవలం అవినీతిని కాపాడుకోవడానికేనని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్ హయాంలో ఉపాధి హామీ పథకం అవినీతికి మారుపేరుగా మారిందని, కూలీలకు బదులు యంత్రాలతో పనులు చేయించి కాంట్రాక్టర్లు నిధులు కాజేశారని చౌహాన్ విమర్శించారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా పనిచేస్తున్నట్లు రికార్డులు సృష్టించి మోసం చేశారని పేర్కొన్నారు.


కొత్త చట్టం ప్రయోజనాలు

మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం (VB-GRAM G Act) ద్వారా ఉపాధి గ్యారంటీని 125 రోజులకు పెంచామని, నిరుద్యోగ భృతి మరియు వేతన చెల్లింపుల్లో జాప్యానికి జరిమానా వంటి కఠిన నిబంధనలు చేర్చామని ఆయన తెలిపారు.  యూపీఏ హయాంలో కేవలం రూ. 2 లక్షల కోట్లు కేటాయిస్తే, మోడీ ప్రభుత్వం రూ. 8.48 లక్షల కోట్లకు పైగా నిధులను వెచ్చించిందని ఆయన గుర్తు చేశారు. కొత్త చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జనవరి 8 నుంచి దేశవ్యాప్తంగా మూడు దశల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి గ్రామాల అభివృద్ధిపై ఆసక్తి లేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ఆందోళనలు చేస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు.

No comments:

Post a Comment

Featured post

కీవ్‌పై రష్యా ‘హైపర్‌సోనిక్ ఒరెష్నిక్’ మిస్సైల్స్ తో దాడి

 కీవ్‌పై రష్యా ‘హైపర్‌సోనిక్ ఒరెష్నిక్’ మిస్సైల్స్ తో దాడి ఉక్రెయిన్ రాజధానిపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం కీవ్: రష్యా-ఉ...