Saturday, 31 January 2026

భారత ఆర్థిక ప్రగతికి ఆరు సూత్రాల వ్యూహం

 


  • లోకసభలో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేస్తూ, దానిని సుస్థిరంగా కొనసాగించే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోకసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆరు కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు. 

  • వ్యూహాత్మక, అత్యాధునికమైన ఏడు రంగాలలో ఉత్పాదకతను భారీగా పెంచడం
  • పాత పారిశ్రామిక రంగాలకు పునరుత్తేజం కలిగించడం
  • ఎంఎస్ఎంఈలను గ్లోబల్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దడం 
  • వీటితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ఊతాన్నివ్వడం
  • దేశ దీర్ఘకాలిక భద్రత , స్థిరత్వాన్ని నిర్ధారించడం
  • నగరాలను ఆర్థిక మండలాలుగా అభివృద్ధి చేయడం

వీటిపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.


ఆత్మనిర్భర్ భారత్ నినాదం దేశీయ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, ఇంధన భద్రతను మెరుగుపరిచి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించిందని మంత్రి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల ఉపాధి కల్పన పెరగడమే కాకుండా, వ్యవసాయ ఉత్పాదకత, సామాన్యుల కొనుగోలు శక్తి కూడా మెరుగుపడిందని ఆమె పేర్కొన్నారు. ఈ సంస్కరణల ఫలితంగానే దేశం ప్రస్తుతం సుమారు 7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తూ, పేదరిక నిర్మూలనలో, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో గణనీయమైన పురోగతిని సాధిస్తున్నదని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతి చర్య, పథకం నేరుగా పౌరులకు ప్రయోజనం చేకూర్చేలా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...