Tuesday, 20 January 2026

ఎన్డీయే గూటికి టీటీవీ దినకరన్

 



  • పీయూష్ గోయల్‌తో కీలక భేటీ



తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకున్నది. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) అధినేత టీటీవీ దినకరన్ మళ్ళీ  ఎన్డీఏ (NDA)లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత పియూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి వ్యూహాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. గతంలో ఎన్డీయే నుంచి విడిపోయిన దినకరన్, ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్ట్యా మళ్ళీ బీజేపీతో చేతులు కలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కలయికతో తమిళనాడులో డీఎంకే కూటమిని బలంగా ఢీకొట్టవచ్చని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. దినకరన్ రాకతో అటు బీజేపీకి, ఇటు ఏఎమ్మెన్కేకు రాజకీయంగా కొత్త బలం చేకూరినట్లయింది. త్వరలోనే సీట్ల కేటాయింపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


No comments:

Post a Comment

Featured post

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది

 ఢిల్లీలో నిరసనకారులపై భారీగా పోలీసు బలగాలను మోహరించడమే దీనికి నిదర్శనం మండిపడిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  బెంగళూరు: ప్...