Sunday, 18 January 2026

ఉత్తరాదిని కమ్మేస్తున్న పొగమంచు



  • ఢిల్లీ సహా పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక
  • హిమాచల్‌లో కొనసాగుతున్న చలితీవ్రత!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలను దట్టమైన పొగమంచు ముంచెత్తుతున్నది. హరియాణా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో సోమవారం భారీగా పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని హిమాలయ పర్వత ప్రాంతాలు, సిక్కింలో కూడా ఉండవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో రేపటి వరకు శీతల గాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. రాబోయే మూడు రోజుల్లో తూర్పు భారతదేశంలో కనీస ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన నివేదికలో పేర్కొంది.

No comments:

Post a Comment

Featured post

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది

 ఢిల్లీలో నిరసనకారులపై భారీగా పోలీసు బలగాలను మోహరించడమే దీనికి నిదర్శనం మండిపడిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  బెంగళూరు: ప్...