Wednesday, 28 January 2026

తెలంగాణలో మోగిన పురపోరు నగారా

 ఫిబ్రవరి 11న పోలింగ్‌




హైదరాబాద్‌: తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్‌ఈసీ రాణికుముదిని ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. 


మున్సిపల్‌ ఎన్నికల ముఖ్య తేదీలు...

జనవరి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

జనవరి 30తో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ గడవు

జనవరి 31న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన

ఫిబ్రవరి 3.. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు

ఫిబ్రవరి 11న పోలింగ్‌ 

రీపోలింగ్‌ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు

ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు

ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక

ఫిబ్రవరి 16న కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 53 లక్షల మందికి పైగా ఓటర్లు 

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...