Tuesday, 20 January 2026

బీజేపీ సిద్ధాంతమే నాకు శిరోధార్యం


  • జాతీయవాద ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తా
  • బాధ్యతలు చేపట్టిన వెంటనే నితిన్ నబిన్ ప్రతిజ్ఞ!

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్, పార్టీ మూల సిద్ధాంతాలను ,జాతీయవాద భావజాలాన్ని కాపాడటమే తన ప్రథమ కర్తవ్యమని ఉద్ఘాటించారు. మంగళవారం ఢిల్లీలో అధికారికంగా పగ్గాలు చేపట్టిన అనంతరం ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారు. శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వంటి మహనీయులు నిర్మించిన ఈ గొప్ప పార్టీకి నాయకత్వం వహించే అవకాశం రావడం తన అదృష్టమని, వారి ఆశయాలకు అనుగుణంగా బీజేపీని ఒక శక్తివంతమైన జాతీయవాద ఉద్యమంగా మరింత ముందుకు తీసుకెళ్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అంత్యోదయ సిద్ధాంతం ద్వారా సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ఫలాలను అందించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.



ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతున్న తరుణంలో, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేస్తానని నబిన్ హామీ ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి శ్రమ, త్యాగాల వల్లే బీజేపీ ఈ స్థాయికి చేరుకుందని ఆయన కొనియాడారు. సాంస్కృతిక జాతీయవాదాన్ని బలోపేతం చేస్తూనే, దేశాభివృద్ధిలో పార్టీ భాగస్వామ్యాన్ని మరింత పెంచుతామని చెప్పారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ.. ప్రజల నమ్మకాన్ని కాపాడేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 


No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...