Thursday, 29 January 2026

రాష్ట్రపతి ప్రసంగంపై 18 గంటల సుదీర్ఘ చర్చ

  • ఫిబ్రవరి 4న పార్లమెంట్‌లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై  లోక్‌సభలో సుమారు 18 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరగనుంది. ఈ చర్చ ముగిసిన అనంతరం, ఫిబ్రవరి 4వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభలో ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రసంగించనున్నారు. బీఏసీ  సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.



ఈ చర్చలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు దేశ ఆర్థిక స్థితిగతులు, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అంతర్జాతీయ సంబంధాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ముఖ్యంగా 'ఆపరేషన్ సిందూర్' వంటి అంశాలు, నేడు విడుదలైన ఆర్థిక సర్వే అంశాలు ఈ చర్చలో ప్రధానంగా వినిపించే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమవుతుండగా, అధికార పక్షం 'వికసిత్‌ భారత్' లక్ష్యాలను వివరిస్తూ దీటుగా సమాధానం చెప్పేందుకు సమాయత్తమవుతున్నది.


రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు లోక్‌సభలో 18 గంటల సమయం కేటాయించగా, రాజ్యసభలో కూడా తగిన సమయాన్ని కేటాయించారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌కు ముందు ఈ చర్చ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోడీ తన ప్రసంగంలో దేశ భవిష్యత్తు ప్రణాళికలను, ప్రభుత్వం సాధించిన విజయాలను మరోసారి దేశ ప్రజల ముందుకు ఉంచనున్నారు.



No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...