- లియామ్ పేన్ జ్ఞాపకార్థం 'డార్క్ టు లైట్' సాంగ్ విడుదల
ప్రముఖ హాలీవుడ్ గాయకుడు లూయిస్ టాంలిన్సన్ తన దివంగత స్నేహితుడు, మాజీ 'వన్ డైరెక్షన్' బ్యాండ్‌మేట్ లియామ్ పేన్‌కు సంగీతం ద్వారా భావోద్వేగ నివాళి అర్పించారు. గతేడాది అక్టోబర్‌లో అర్జెంటీనాలో జరిగిన ప్రమాదంలో లియామ్ పేన్ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా లూయిస్ విడుదల చేసిన తన కొత్త ఆల్బమ్ 'హౌ డిడ్ ఐ గెట్ హియర్?' (How Did I Get Here?) లోని 'డార్క్ టు లైట్' అనే పాట ఇప్పుడు అభిమానుల కళ్లు చెమ్మగిల్లేలా చేస్తున్నది. ఈ పాటలోని సాహిత్యం, లూయిస్ అనుభవిస్తున్న బాధను, తన స్నేహితుడిని కోల్పోయిన తీరును కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నది.
ముఖ్యంగా "నీ కళ్లలో నీవు ఎలా కనిపిస్తావో ఒక్కసారి చూస్తే బాగుండేది.. అది నిన్ను చీకటి నుంచి వెలుగులోకి తీసుకురాగలదా?" వంటి వరుసలు లియామ్ మానసిక పోరాటాన్ని, స్నేహితుడిగా లూయిస్ పడుతున్న ఆవేదనను ప్రతిబింబిస్తున్నాయి. ఈ పాట పేరు కూడా లియామ్ పేన్ శరీరంలోని "హియర్ డార్క్ మీట్స్ లైట్" అనే టాటూను స్ఫురింపజేస్తున్నదని అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. లూయిస్ గతంలోనే లియామ్‌ను తన సోదరుడిగా భావిస్తానని, తన జీవితంలో ఒక భాగం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు విడుదలైన ఈ గీతం వారి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది.
No comments:
Post a Comment