Wednesday, 21 January 2026

భారతదేశం - ఐరోపా మధ్య చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం

 




  •  ప్రపంచ ఆర్థిక గమనంలో కొత్త శకం!

భారతదేశం, ఐరోపా సమాఖ్య (ఈయూ) మధ్య చరిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) త్వరలోనే సాకారం కానున్నదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ప్రకటించారు. దీనిని అన్ని ఒప్పందాలకు తల్లి వంటిదని ఆమె అభివర్ణించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రసంగించిన ఆమె, దావోస్ పర్యటన ముగిసిన వెంటనే భారతదేశానికి వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ భారీ ఒప్పందం ద్వారా దాదాపు 200 కోట్ల మంది జనాభాతో కూడిన భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తుందని, ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు నాలుగో వంతు వాటాను కలిగి ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ ఒప్పందం తుది దశకు చేరుకోవడానికి ఇంకా కొంత కసరత్తు చేయాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు.


ల్యాటిన్ అమెరికా నుంచి ఇండో - పసిఫిక్ ప్రాంతం వరకు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఐరోపా భావిస్తున్నది. ఈ క్రమంలోనే యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లేయన్ జనవరి 25 నుండి 27 వరకు భారతదేశంలో పర్యటించనున్నారు. వీరు భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథులుగా పాల్గొనడంతో పాటు, భారత్-ఈయూ శిఖరాగ్ర సదస్సుకు ఉమ్మడిగా అధ్యక్షత వహించనున్నారు. ఈ పర్యటనతో రెండు ఆర్థికశక్తుల మధ్య బంధం మరింత దృఢపడటమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక మార్పులకు వేదిక కానున్నది.






No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...