- ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు
వారణాసిలో జరుగుతున్న 72వ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ఇప్పుడు చురుగ్గా సిద్ధమవుతోందని ప్రధాని ప్రకటించారు. గత దశాబ్ద కాలంలో ఫిఫా అండర్-17 వరల్డ్ కప్, హాకీ వరల్డ్ కప్ వంటి 20కి పైగా అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లను భారత్ విజయవంతంగా నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోందని, ఇది మన దేశ క్రీడా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. 'టాప్స్' (Target Olympic Podium Scheme) వంటి పథకాల ద్వారా దేశంలో క్రీడా వాతావరణం పూర్తిగా మారిపోయిందని, క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందుతోందని ప్రధాని తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం 2036 ఒలింపిక్స్‌కు ప్రధాన వేదికగా నిలిచే అవకాశం ఉందని, దీని కోసం భారీ బడ్జెట్‌తో ప్రపంచ స్థాయి వసతులను ప్రభుత్వం కల్పిస్తోందని నివేదికలు చెబుతున్నాయి.
No comments:
Post a Comment