Showing posts with label #IPL2027 #IPLAuction #MSDhoni #SRH #CSK #MI #RCB #KKR #CricketNews. Show all posts
Showing posts with label #IPL2027 #IPLAuction #MSDhoni #SRH #CSK #MI #RCB #KKR #CricketNews. Show all posts

Tuesday, 17 November 2026

ఐపీఎల్‌ 2027కు జట్ల కూర్పులో భారీ మార్పులు.. స్టార్‌ ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీలు!



క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 2027 సీజన్‌కు సంబంధించి ఫ్రాంచైజీలు తమ జట్ల నుంచి విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా వెలువడింది. పలు జట్లు కీలక ఆటగాళ్లను వదులుకోవడంతో వచ్చే సీజన్‌ వేలంలో ఆసక్తికర పోటీ నెలకొనే అవకాశం ఉంది. డిసెంబర్‌ 16న గోవాలో ఆటగాళ్ల వేలం జరగనుంది.


ముంబయి ఇండియన్స్‌ ట్రెంట్‌ బౌల్ట్‌, దీపక్‌ చాహర్‌, కేశవ్‌ మహరాజ్‌, ఏఎం ఘజన్‌ఫర్‌, అథర్వ అన్కోలేకర్‌, మహమ్మద్‌ ఇజార్‌, దానిష్‌ మాలేవార్‌, మయాంక్‌ మార్కండే, మయాంక్‌ రావత్‌లను విడుదల చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ మిచెల్‌ స్టార్క్‌, నితీశ్‌ రాణా, అభిషేక్‌ పొరెల్‌, బెన్‌ డకెట్‌, నిశాంక, కరుణ్‌ నాయర్‌, సాహిల్‌ పరఖ్‌, దుష్మంత చమీర, రెహాన్‌ అహ్మద్‌, అజయ్‌ మండల్‌లను వదులుకుంది.


పంజాబ్‌ కింగ్స్‌ లాకీ ఫెర్గూసన్‌, నేహల్‌ వధేరా, ప్రవీణ్‌ దూబే, మిచ్‌ ఓవెన్‌, పైల అవినాశ్‌, విశాల్‌ నిషాద్‌లను విడుదల చేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్రావిస్‌ హెడ్‌, కమిందు మెండిస్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, దిల్షాన్‌ మధుశంక, ఓంకార్‌ తర్మలే, అమిత్‌ కుమార్‌, శివమ్‌ మావి, జెరాల్డ్‌ కొయెట్జీ, డేవిడ్‌ పైన్‌లను వదులుకుంది.


చెన్నై సూపర్‌ కింగ్స్‌ జాబితాలో ఎంఎస్‌ ధోనీ (రిటైర్డ్‌), ప్రశాంత్‌ వీర్‌, మ్యాట్‌ హెన్రీ, కుల్దీప్‌ యాదవ్‌, మాథ్యూ షార్ట్‌, జాక్‌ ఫౌల్కెస్‌, అమన్‌ ఖాన్‌, ఆకాశ్‌ మాధ్వాల్‌, ఫారెస్టర్‌, నొరోన్హా ఉన్నారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జాకబ్‌ బెథెల్‌, రిచర్డ్‌ గ్లీసన్‌, మంగేశ్‌ యాదవ్‌, విహాన్‌ మల్హోత్రా, సాత్విక్‌ దేశ్వాల్‌లను విడుదల చేసింది.


లక్నో సూపర్‌ జెయింట్స్‌ అవేశ్‌ ఖాన్‌, నోకియా, వనిందు హసరంగ, జార్జ్‌ లిండే, నమన్‌ తివారీ, మాథ్యూ బ్రిట్జ్‌కే, అర్షిన్‌ కులకర్ణిలను వదులుకుంది. గుజరాత్‌ టైటాన్స్‌ షారుఖ్‌ ఖాన్‌, ఇశాంత్‌ శర్మ, ల్యూక్‌ వుడ్‌, కుల్వంత్‌ ఖేజ్రోలియా, కానర్‌ ఎస్తెర్‌హుయిజెన్‌, పృథ్వీరాజ్‌ యర్రాలను విడుదల చేసింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రహానె, మతీశ పతిరన, రచిన్‌ రవీంద్ర, రాహుల్‌ త్రిపాఠి, ఆకాశ్‌ దీప్‌, ముజారబాని, దక్ష్‌ కామ్రా, లవ్‌నీత్‌ సిసోడియా, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌, నవ్‌దీప్‌ సైనీ, ఉమ్రాన్‌ మాలిక్‌, తేజస్వీ సింగ్‌లను వదులుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ హెట్‌మయర్‌, తుషార్‌ దేశ్‌పాండే, ఆడమ్‌ మిల్నే, ఇమాన్‌జ్యోత్‌ చాహల్‌, కుల్దీప్‌ సేన్‌, మాఫాక, రవి సింగ్‌, విఘ్నేశ్‌ పుత్తుర్‌, యుధ్వీర్‌ చరక్‌లను విడుదల చేసింది.


  • ఏ జట్టు దగ్గర ఎంత మొత్తం ఉంది?


ట్రేడింగ్‌, రిటెన్షన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత లక్నో సూపర్‌ జెయింట్స్‌ వద్ద రూ.47.45 కోట్లు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వద్ద రూ.41.65 కోట్లు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వద్ద రూ.40.15 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్‌ వద్ద రూ.39.50 కోట్లు, ముంబయి ఇండియన్స్‌ వద్ద రూ.32.60 కోట్లు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ వద్ద రూ.28.05 కోట్లు, రాజస్థాన్‌ రాయల్స్‌ వద్ద రూ.27.05 కోట్లు, పంజాబ్‌ కింగ్స్‌ వద్ద రూ.18.60 కోట్లు, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వద్ద రూ.14.50 కోట్లు, గుజరాత్‌ టైటాన్స్‌ వద్ద రూ.8.75 కోట్లు మిగిలి ఉన్నాయి.


మిగిలిన ఆటగాళ్ల స్లాట్ల విషయానికి వస్తే లక్నోకు 7 (విదేశీ ఆటగాళ్లకు 3), కోల్‌కతాకు 8 (3), హైదరాబాద్‌కు 7 (3), ఢిల్లీకి 9 (4), ముంబయికి 9 (2), చెన్నైకి 6 (2), రాజస్థాన్‌కు 6 (3), పంజాబ్‌కు 6 (2), బెంగళూరుకు 5 (1), గుజరాత్‌కు 3 (2) స్లాట్లు అందుబాటులో ఉన్నాయి.



Featured post

రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానాన్ని గొడ్డలితో ధ్వంసం చేసిన దుండగుడు.. ఐర్లాండ్‌లో సంచలనం!

ఐర్లాండ్‌లోని షానన్‌ విమానాశ్రయంలో పార్క్‌ చేసి ఉన్న అమెరికా సైనిక రవాణా విమానంపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గొడ్డలి, ప్రత్యేక రసాయనాన్ని...