కొన్ని నెలలుగా కొలువుల ముచ్చట ప్రకటనలకే పరిమితం అయ్యింది. జూలై 13, 14 తేదీల్లో జరిగిన క్యాబినెట్ భేటీల్లో 50 వేల కొలువుల భర్తీ కి ఆమోదముద్ర పడుతుంది అని నిరుద్యోగులు ఆశించారు. కానీ వారి ఆశలు అడియశలే అయ్యాయి. అధికారులు అందించిన ఖాళీల వివరాలు అసంపూర్తిగా ఉన్నాయి అని పూర్తి వివరాలతో రావాలని క్యాబినెట్ ఆదేశించింది. ఆ తర్వాత మరో ఐదు రోజులకు క్యాబినెట్ మీట్ ఉంటుంది అని వార్తలు వచ్చాయి. తిరిగి 17 రోజుల తర్వాత ఆగస్టు 1న క్యాబినెట్ భేటీ జరిగింది. నిన్న కూడా కొత్త నియామకాలకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది అనుకున్నారు. కానీ నిన్న కూడా నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. జూలై 9న 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా వెలువడింది. జూలై నెలలో దాదాపు కొలువుల ముచ్చటే నడిచింది. ఖాళీల వివరాలు అసమగ్రం, వాటిపై అధ్యయనం అనేవి ఉత్త ముచ్చట్లే.ఎందుకంటే ఒక్కరోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు లేవంటే నమ్మశక్యంగా లేదు. దాదాపు ఏడు నెలలుగా నియామకాల అంశంపై ప్రభుత్వం అనేక ప్రకటనలు చేసింది. కాబట్టి ఖాళీల సమగ్ర వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ వాటిని భర్తీ చేయాలనే సంకల్పమే లేదు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
ముఖ్యమంత్రి మార్పు ఖాయమేనా?
తెలంగాణ సీఎం ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంటున్నాయి. నిన్న వనపర్తి సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు ఏదో చేయాలనే ఆలోచనతో ప్ర...

-
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు కూటముల కూర్పు, అభ్యర్థుల తర్వాత అక్కడి ప్రజాభిప్రాయాన్ని అనేక సర్వే సంస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశ...
-
వరుసగా మూడోసారి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014,2019లో సొంతంగా మెజారిటీ సాధించడంలో మంత్రివర్గ కూర్పులోనూ తన మార్క్‌ను చూపెట్...
-
రాష్ట్రంలో ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజలు మార్పు కోరుకున్న మార్పు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష...
No comments:
Post a Comment