Monday, 2 August 2021
సంక్షేమం- సంక్షోభం
ప్రజా సంక్షేమం కోసం తెచ్చిన పథకాలు ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి తెర తీశాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయిన నేపథ్యంలో అధికార పార్టీ అక్కడ ఎలాగైనా తన పట్టును నిలుపుకోడానికి ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే అక్కడ దళిత బంధు, రెండో విడత గొర్రెల పంపిణి, నామినేటెడ్ పదవులు చేపట్టింది. దళిత బంధు కొత్తగా ఎన్నికల కోసం తెచ్చింది కాదు అని, రాజకీయ కోణం లేదు అని సీఎంతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. కానీ ఈటల రాజీనామా వ్యవహారం కొందరికి రాజకీయంగా లబ్ధి చేకూరింది. ఏండ్ల తరబడి పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న వారిని ఇప్పటికైనా పడవులు దక్కాయని అంటున్నారు. నిజమే. ఉప ఎన్నిక వస్తే నిధులు, పదవులు వస్తాయి అని అంటున్న వారి వాదనలో వాస్తవం ఉన్నది. మొన్న నాగార్జున సాగర్, ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గానికి పథకాలు, నిధుల వరాలు సీఎం ప్రకటించడమే వారి వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. అందుకే ఎమ్మెల్యే గారు రాజీనామా చేయండి అని ప్రజల నించి ప్రజాప్రతినిధులకు వారి వారి నియోజకవర్గాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావాలని, అర్హులైన వారందరికీ ఆ ఫలాలు దక్కాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆశించడం అత్యాశ కూడా కాదు. అందుకే సంక్షేమం కోసం తెచ్చిన కొన్ని పథకాలు అధికార పార్టీకి రాజకీయ లబ్ధి నే కాదు రాజకీయ సంక్షోభాలకు కారణం అవుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణనే 'రాజీనామా' డిమాండ్లు తెరపైకి రావడం.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాన్...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment