రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు దూషణలకు కేంద్ర బిందువు అయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య వ్యక్తిగత దూషణల కాలం నడుస్తున్నది. ఇవి సామాజిక మాధ్యమాల్లో కూడా అనుకూల, ప్రతికూల వాదనలకు వేదిక అవ్వడమే ఇప్పటి విషాదం. ప్రజా సమస్యల పేరుతో జరుగుతున్న ఈ వాదోపవాదాలు చివరికి అసలు అంశాలను పక్కదోవ పట్టిస్తున్నాయి. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే తమను ఎన్నుకున్న ప్రజలదే అసలు తప్పు అనేలా ఉన్నారు.
నాయకులు సహనం కోల్పోతున్నారు అంటేనే వాళ్ళకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్స సందర్భంలోనే అసహనానికి గురవుతుంటారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్, బీజేపీ నేతల నుంచి రాజకీయ విమర్శలతో పాటు ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. దీనికి ప్రతిగా ఏడేండ్ల బీజేపీ పాలనపై, అంతకుముందు పదేండ్ల కాంగ్రెస్ పాలనపై అధికార పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో వివిధ అంశాలపై ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలపై జరుగుతున్న రాజకీయ చర్చలు అదుపుతప్పి బూతుల దాకా వెళ్తున్నాయి. అవి సామాజిక మాధ్యమాల్లో కి వచ్చే సరికి మరింత శృతి మించుతున్నాయి.
చర్యకు ప్రతిచర్య అన్నట్టు కొంతమంది నేతల వ్యవహార శైలి పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేసే దాకా వచ్చింది. కాబట్టి నాయకులు వ్యక్తిగత దూషణలు మాని, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక. చర్చలు చేస్తేనే ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది.. చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి.
No comments:
Post a Comment