Tuesday, 17 November 2026

అక్వాన్‌ తుపాను ముప్పు.. కోస్తా ప్రజలకు హెచ్చరిక.. రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి!



దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ‘అక్వాన్‌’ తుపాను కేంద్రీకృతమైందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుపాను చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 650 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 660 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది.


గత ఆరు గంటల్లో గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో కదిలిన అక్వాన్‌.. మంగళవారం రాత్రికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్‌ సీఈవో ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణిస్తూ ఎల్లుండి ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశముందని పేర్కొన్నారు.


శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు-విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.


తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే గురు, శుక్రవారాల్లో కోస్తా తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రఖర్‌ జైన్‌ విజ్ఞప్తి చేశారు. రైతులు కూడా వ్యవసాయ పనుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.



No comments:

Post a Comment

Featured post

రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానాన్ని గొడ్డలితో ధ్వంసం చేసిన దుండగుడు.. ఐర్లాండ్‌లో సంచలనం!

ఐర్లాండ్‌లోని షానన్‌ విమానాశ్రయంలో పార్క్‌ చేసి ఉన్న అమెరికా సైనిక రవాణా విమానంపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గొడ్డలి, ప్రత్యేక రసాయనాన్ని...