- నిరాశ వ్యక్తం చేసిన నటుడు అనూప్ సోని
న్యూఢిల్లీ:
పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ 'షక్' (Shaque) లో తన పాత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చివరికి ఎడిటింగ్‌లో తొలగించబడటంపై నటుడు అనూప్ సోని నిరాశ వ్యక్తం చేశారు. ఈ సిరీస్‌లో ఆయన 'ఇన్స్పెక్టర్ ఖురానా' పాత్రలో నటించారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా సృష్టించిన ఈ సిరీస్‌కు రెంసిల్ డిసిల్వా దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ నుంచి తొలగించబడిన కొన్ని సీన్లకు సంబంధించిన వీడియోలను అనూప్ సోని తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
ఒక సన్నివేశాన్ని తెరకెక్కించడానికి రచయితలు, దర్శకులు, యాక్షన్ కొరియోగ్రాఫర్లు, నటులు, సినిమాటోగ్రాఫర్లు మరియు మొత్తం సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడతారని, సమయం, వనరులను వెచ్చిస్తారని ఆయన పేర్కొన్నారు. తమ పాప అదృశ్యం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే తల్లి ప్రయాణంతో సాగే ఈ కథలో పరిణీతి చోప్రా ప్రధాన పాత్ర పోషించగా.. సోని రాజ్దాన్, జెన్నిఫర్ వింగెట్, తాహిర్ రాజ్ భాసిన్, హర్లీన్ సేథీ, సుమీత్ వ్యాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

No comments:
Post a Comment