Friday, 6 February 2026

డిజిటల్ మోసాల బాధితులకు ఆర్బీఐ గుడ్ న్యూస్

  •  ₹25,000 వరకు పరిహారం!

ముంబై: డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ కస్టమర్లకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ మోసానికి గురైన కస్టమర్లకు ₹25,000 వరకు పరిహారం చెల్లిస్తామని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గురువారం ప్రకటించారు.  మోసగాళ్లకు కస్టమర్లు పొరపాటున వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) షేర్ చేసిన కేసుల్లో కూడా ఈ పరిహారం అందుతుందని మల్హోత్రా స్పష్టం చేశారు. ఈ డబ్బును ఆర్‌బీఐకి చెందిన 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్' నుండి చెల్లిస్తారు.



  • పరిహార నిబంధనలు


  1. ఈ పరిహారం జీవితంలో ఒక్కసారి మాత్రమే పొందవచ్చు.
  2. కస్టమర్ మోసానికి గురయ్యారని నిర్ధారణ కావాలి, ఎలాంటి దురుద్దేశం ఉండకూడదు.
  3. మోసపోయిన మొత్తంలో 15 శాతం సొమ్మును కస్టమరే భరించాలి (పరిహారం ₹25,000 లోపు ఉన్నా కూడా).
  4. పెద్ద మొత్తంలో మోసపోయినప్పటికీ, గరిష్ట పరిహారం ₹25,000 మాత్రమే ఉంటుంది.


  • త్వరలో ముసాయిదాను విడుదల

66 శాతం డిజిటల్ మోసాలు ₹50,000 లోపునే జరుగుతున్నాయి, కాబట్టి చాలామందికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది .త్వరలో ఈ పరిహార విధానంపై ప్రజల అభిప్రాయాల కోసం ముసాయిదాను విడుదల చేస్తారు. సీనియర్ సిటిజన్లు మోసపోకుండా ఉండేందుకు అదనపు భద్రతా సాధనాలను ఆర్‌బీఐ తీసుకురానుంది.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...