Sunday, 8 February 2026

భారత్-సీషెల్స్ బంధానికి కొత్త ఊపు


  • ఢిల్లీలో ప్రధాని మోదీతో సెయిషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని కీలక చర్చలు!



భారతదేశ పర్యటనలో ఉన్న సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని సోమవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో అత్యంత కీలకమైన భేటీ నిర్వహించనున్నారు. చెన్నై , ముంబై నగరాల్లో తమ పర్యటనను విజయవంతంగా ముగించుకుని నిన్న ఢిల్లీకి చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ ఘనస్వాగతం పలికారు. ఇరు దేశాల నేతలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక, ప్రాంతీయ , అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా అధ్యక్షుడు హెర్మిని భేటీ కానున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశానికి కీలకమైన మారిటైమ్ పొరుగు దేశంగా ఉన్న సీషెల్స్, భారత్  'మహాసాగర్' (SAGAR) విజన్‌లో , గ్లోబల్ సౌత్ పట్ల దేశ నిబద్ధతలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. భారతదేశం , సీషెల్స్ మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంలో జరుగుతున్న ఈ పర్యటన, ఇరు దేశాల మధ్య విస్తృతమైన సహకారాన్ని, ప్రజల మధ్య బలమైన సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. చెన్నై, ముంబైలలో జరిగిన వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, తన పర్యటనలో భాగంగా పాలన, పరిశ్రమలు, కోస్తా నిర్వహణ , ఆరోగ్య రంగాలలోని కీలక వ్యక్తులతో చర్చలు జరిపారు.

No comments:

Post a Comment

Featured post

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది

 ఢిల్లీలో నిరసనకారులపై భారీగా పోలీసు బలగాలను మోహరించడమే దీనికి నిదర్శనం మండిపడిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  బెంగళూరు: ప్...