Friday, 6 February 2026

నా విజయం వెనుక వారి శ్రమ ఉంది


  • 'ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్' అవార్డును సపోర్ట్ స్టాఫ్‌కు అంకితం చేసిన సూర్యవంశీ

హరారే: అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై చరిత్రాత్మక విజయం సాధించి, భారత్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించిన యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ, తన 'ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్' అవార్డును భారత జట్టు సహాయక సిబ్బందికి అంకితం చేశారు.


7-8 నెలల కఠోర శ్రమ

ఇంగ్లాండ్‌పై 80 బంతుల్లో 175 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన 14 ఏళ్ల సూర్యవంశీ, విజేతగా నిలిచిన అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమంలో మాట్లాడారు. "మేము గత 7-8 నెలలుగా పడుతున్న కఠోర శ్రమ వెనుక సపోర్ట్ స్టాఫ్ పాత్ర ఎంతో ఉంది. వారు మమ్మల్ని అన్నివిధాలా చూసుకున్నారు, అందుకే ఈ అవార్డు వారికి అంకితం చేస్తున్నాను" అని సూర్యవంశీ పేర్కొన్నారు.



అరుదైన ఘనత


అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో ఒకే టోర్నీలో 'ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్', 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డులను గెలుచుకున్న మొదటి ఆటగాడిగా సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. అండర్-19 క్రికెట్‌లో కేవలం 71 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన 150 పరుగుల రికార్డును కూడా తన పేరుతో లిఖించుకున్నాడు. సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్ 411 పరుగులు చేసి, ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించి ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

No comments:

Post a Comment

Featured post

అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు నేడే పోలింగ్

ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం దేశంలోని మూడు కీలక ప్రాంతాలైన అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు కొత్త ప్రజా ప్రతినిధులను ఎన్ను...