- రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగంపై జైరాం రమేష్ తీవ్రస్థాయి విమర్శలు
న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోడీని "అబద్ధాల కోరు" ,"అభద్రతా భావాల నిలయం"గా ఆయన అభివర్ణించారు. ప్రధాని ప్రసంగంలో వాస్తవాలు లేవని, కేవలం విపక్షాలపై ఆరోపణలు మాత్రమే ఉన్నాయని జైరాం రమేష్ ఆరోపించారు.
ప్రధాని మోడీ తన ప్రసంగంలో అనేక అబద్ధాలను ప్రచారం చేశారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని జైరాం రమేష్ అన్నారు. ఆయన మాటల్లో ఆత్మవిశ్వాసం కంటే అభద్రతా భావం ఎక్కువగా కనిపిస్తున్నదని, ఆయన తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విపక్షాలను నిందిస్తున్నారని విమర్శించారు. ప్రధాని వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని, దేశంలోని అసలు సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. దేశ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన ప్రధాని, తన ప్రసంగంలో కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని జైరాం రమేష్ అన్నారు.
No comments:
Post a Comment