Wednesday, 11 February 2026

రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

  •  బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు

న్యూఢిల్లీ: పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్రమైన చర్యలకు డిమాండ్ చేశారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు  నోటీసు ఇచ్చారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తన పార్లమెంటరీ సాంప్రదాయాలకు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని నిశికాంత్ దూబే ఆరోపించారు. 



  • హక్కుల ఉల్లంఘన  

సభలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించడం, ఇతర ఎంపీలను రెచ్చగొట్టడం ద్వారా రాహుల్  సభ గౌరవాన్ని తగ్గించారని దూబే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.రాహుల్ గాంధీ చర్యలు తీవ్రమైన హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని దూబే వాదించారు. సభలో క్రమశిక్షణను కాపాడటానికి, ఇలాంటి ప్రవర్తనను ఉపేక్షించకూడదని ఆయన స్పీకర్‌ను కోరారు. ఈ పరిణామం పార్లమెంటులో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ఘర్షణను మరింత తీవ్రతరం చేసింది. రాహుల్ గాంధీ ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ తాజా పరిణామం రాజకీయంగా దుమారం రేపుతోంది.




No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...