- పప్పు యాదవ్ అరెస్ట్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: నీట్ (NEET) విద్యార్థి మృతి కేసులో న్యాయం డిమాండ్ చేసినందుకు పప్పు యాదవ్‌ను అరెస్ట్ చేయడం రాజకీయ కక్షసాధింపు చర్య అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను నొక్కేసే ప్రయత్నం జరుగుతున్నదని ఆయన ఆరోపించారు.
- రాజకీయ కక్షసాధింపు
విద్యార్థుల కోసం పోరాడుతున్న నాయకులను అరెస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నదని రాహుల్ అన్నారు. నీట్ పరీక్షల్లో అక్రమాలు, విద్యార్థుల ఆత్మహత్యలపై న్యాయం కోరడం తప్పు కాదని, దాని కోసం నిలబడిన పప్పు యాదవ్‌ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు. పప్పు యాదవ్ అరెస్ట్‌పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం వెంటనే ఆయనను విడుదల చేయాలని , నీట్ కేసులో వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
- పట్నా హాస్టల్‌లో విద్యార్థి మృతిపై వివాదం
పాట్నాలోని ఒక హాస్టల్‌లో నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసులో న్యాయం కోసం పప్పు యాదవ్ పోరాడుతున్నారు. ఈ కేసులో FIR నమోదు నుంచి విచారణ వరకు అన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా ఆరోపించారు. ఈ కేసులో నిందితులను కాపాడటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బిహార్ ప్రభుత్వం ఈ కేసును CBI విచారణకు సిఫార్సు చేసింది.
No comments:
Post a Comment