Thursday, 12 February 2026

తెలంగాణ పురపోరు: ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీదే హవా

 




  • రెండో స్థానంలో బీఆర్‌ఎస్‌
  • మూడోస్థానంలో బీజేపీ


హైదరాబాద్: తెలంగాణలో జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ప్రారంభ ఫలితాల సరళిని పరిశీలిస్తే, కాంగ్రెస్ పార్టీ 800+ వార్డుల్లో స్పష్టమైన ఆధిక్యతతో ముందంజలో ఉంది.  భారత్ రాష్ట్ర సమితి (BRS) 400+ వార్డుల్లో ఆధిక్యతతో రెండో స్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, ఏడు మునిసిపల్ కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ (BJP) 80+ వార్డుల్లో ఆధిక్యతతో మూడో స్థానానికి పరిమితమైంది. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 80 పైగా వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నారు.  ఎన్నికల సంఘం, పోలీసులు లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.  పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. వార్డుల వారీగా ఫలితాలు వెలువడుతున్న కొద్దీ అధికారికంగా ప్రకటించనున్నారు.




 



No comments:

Post a Comment

Featured post

ప్రపంచ , దేశీయ తాజా వార్తా ముఖ్యాంశాలు

  🌐 అంతర్జాతీయ విశేషాలు (భారత్ - ఆస్ట్రేలియా ద్వైపాక్షిక చర్చలు) చరిత్రాత్మక హాట్రిక్: గత 12 ఏళ్లలో ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది మూడోసారని...