Thursday, 12 February 2026

బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ ప్రభంజనం




  • తారిఖ్‌ రహ్మాన్ విజయం
  • ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమంటున్న పార్టీ

ఢాకా: బంగ్లాదేశ్ ఎన్నికల్లో ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) భారీ విజయాన్ని దిశగా దూసుకుపోతోంది.  తుది అంచనా ఫలితాలు బీఎన్‌పీ అభ్యర్థుల స్పష్టమైన ఆధిక్యాన్ని సూచిస్తుండటంతో, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పార్టీ నాయకత్వం ప్రకటించింది. ముఖ్యంగా తారిఖ్‌ రహ్మాన్ తాను పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం సాధించడం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.  ఈ ఎన్నికలు బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు.  ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, బీఎన్‌పీ వైపు నిలిచారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. రహ్మాన్ విజయంపై దేశవ్యాప్తంగా కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తం 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ , దాని మిత్రపక్షాలు 211 స్థానాల్లో విజయం సాధించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. జమాతే ఇస్లామీ కూటమి 70 సీట్లలో విజయం సాధించింది. 

No comments:

Post a Comment

Featured post

అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు నేడే పోలింగ్

ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం దేశంలోని మూడు కీలక ప్రాంతాలైన అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు కొత్త ప్రజా ప్రతినిధులను ఎన్ను...